|
Article on other languages:
|
వికీపీడియాలో వ్యాసాలలో చేరుస్తున్న వివరాలకు మూలాలు (రిఫరెన్సులు) ఎలా చేర్చాలో ఈ పేజీ వివరిస్తుంది.
మూలాలను ఎందుకు తెలుపాలి
గమనిక: సాధ్యమయినంత వరకు వికీపీడియాలో ఉన్న ఇతర వ్యాసములను మూలాలలో చేర్చవద్దు. అలాంటి వాటిని "ఇవికూడా చూడండి" జాబితాలో ఉంచండి. మూలాలను ఏ ఏ సమయాలలో తెలుపాలివ్యాసంలో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడుమీరు ఏదయినా కొత్త సమాచారాన్ని సేకరించి, దానిని ఇక్కడ ఉన్న వ్యాసాలలో చేర్చాలనుకున్నప్పుడు, మొదట ఆ సమాచారం యొక్క మూలాన్ని తెలుపండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్‌సైటులోని పేజీ లాంటివి ఏదయినా కవచ్చు, కాకపోతే మీరు పొందుపరచిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా చదివేవారెవరయినా నిర్ధారించగలిగేటట్లు ఉండాలి. ఒక వేళ మీరు రాసే సమాచారం గురించి మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఎటువంటి మూలాలను చూడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ అలాంటి సమయాలలో ఇతరులకు మీరు రాసిన దానిపై సందేహాలుంటే వాటిని తీర్చటానికి కావలిసిన మూలాలను చేర్చండి, అప్పుడు ప్రతీ ఒక్కరి సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉండదు. మూలాల యొక్క అసలు అవసరం, ఏదయినా విషయంపై అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు ఉంటుంది. అలా అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు, దానిని ధృవపరచటానికి సరయిన మూలం చూపించారంటే, ఇంక అందరూ మీ వాదననే ఒప్పుకుంటారు (దానికి వ్యతిరేకంగా ఇంకో మంచి మూలం చూపించే దాకా). "కొంతమంది ఇలా భావిస్తారు", "కొంతమంది అలా భావిస్తారు", లాంటి వాక్య నిర్మాణాలను సాధ్యమయినంతవరకు తగ్గించండి. సాధారణంగా అలాంటి వాక్యాలు, చదివేవారి మదిలో వ్యతిరేక ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా "వీరందరూ ఇలా అన్నారు", "వారు అలా అన్నారు", అని రాసి ఆ వారు లేదా వీరందరూ ఎవరో తెలిపి, ఎప్పుడు, ఎక్కడ అన్నారో కూడా తెలిపారంటే ఆ రచన యొక్క ప్రామాణికత ఎన్నోరెట్లు మెరుగుపడుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి, వికీపీడియా మీ అభిప్రాయాలను తెలుపటానికి ఒక వేదిక కాదు. ఇది తెలుగు భాషలో ఉన్న వికీపీడియా కాబట్టి మీ మూలాలను సాధ్యమయినంత వరకూ తెలుగులో ఉండేటట్లు చూడండి. ఒక వేళ తెలుగులో సరయిన మూలాలు దొరకకపోతే, అప్పుడు ఆంగ్లంలో ఉండే మూలాలను సూచించండి. వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించినప్పుడుమీరు చేర్చని విషయాలకు కూడా మీకు తెలిసిన మూలాలు ఏమయినా ఉంటే వాటిని కూడా చేర్చవచ్చు. చేర్చేముందు ఒక సారి పరిశీలించి చేర్చండి. అంతే కాదు వ్యాసానికి మూలాలను చేర్చడం వికీపీడియాలో చాలా గొప్ప కృషిగా భావిస్తారు. వాక్యాలకు పక్కనే మూలాలకు సంబందించిన లింకులు గానీ సమాచారం కానీ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే, వాటిని మీరు రాస్తున్న వాక్యాల పక్కనే ఉంచటం మంచిది. వ్యాసానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నప్పుడుగొడవకు కారణమయిన వ్యాస భాగాన్ని వెంటనే చర్చా పేజీకి తరలించండి. ఒకవేళ ఆ వ్యాస భాగం అంత కీడు తలపెట్టేది కాదు అని అనుకున్నప్పుడు, లేదా దానికి సంబంధించిన మూలాన్ని చేరిస్తే సరిపోతుంది అని భావించినప్పుడు {{మూలాలు అవసరం}} అనే మూసను ఆ వ్యాస భాగం తరువాత ఉంచండి. {{ మూలాలు సమీక్షించండి}} అనే మూస కొన్ని సందర్భాలలో మరింత ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాసానికి సంబందించి గొడవ జరుగుతుందని అనుకున్నప్పుడుముందుగానే ఊహించండి: మీరు చేర్చిన విషయం మీద ఎవరికయినా సందేహం కలుగవచ్చేమో అనే విషయాన్ని ఆలోచించండి. వికీపిడియాలో మీరు చేర్చిన సమాచారానికి ఊతంగా ఏదయినా మంచి మూలాన్ని చేర్చినట్లయితే అప్పుడు ఇతర సభ్యులు ఆ సమాచారాన్ని తొలగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సమాచారం ఎక్కడ లభించిందో తెలుపండిమూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు.., అసలు సమాచారం ఇంకోదగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్‌సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే, దానిని వికీపిడియా మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యవర్తి అయిన వెబ్‌సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:
మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసిన తరువాత మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్‌పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:
దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్ణించేసుకోవడానికి. మూలాలను వ్యాసాలలో చేర్చే విధానంవికీపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినా కూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసంలో మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధా=నమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. విధానం ఒకటిఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు <ref name=ఆంగ్లం1> [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]] </ref> <ref name=ఆంగ్లం2> [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]] </ref>. ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2]. <references /> విధానం రెండుపై పద్ధతిలో కాకుండా, ఈ క్రింది మూసలను కూడా వాడవచ్చు. ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి. {{చూడు|పేరు}} - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు చూపించదలచిన చోట్ల ఈ మూసను తగిలించండి. పేరు అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర పేర్లతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది. {{మూలం|పేరు}} - ఈ మూసను మూలాలు లేదా రిఫరెన్సులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికపీిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు {{చూడు|en3}} {{చూడు|en4}}.
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].
# {{మూలం|en3}} [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]]
# {{మూలం|en4}} [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]]
ఎటువంటి మూలాలను చేర్చాలిఇంటర్నెట్లో వెబ్‌పేజీలకు లింకు ఇచ్చిన మూలాల పేజీలను తొలగించినప్పుడు ఏంచేయాలి? |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.