|
Article on other languages:
|
పత్రాలు లేదా ఆకులు (ఆంగ్లం: Leaves) వృక్ష కాండం మీద బహిర్గతంగా కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఇవి సాధారణంగా బల్లపరుపుగా, ఆకుపచ్చగా ఉండి పరిమిత వృద్ధి కలిగి కాండాగ్రం వరకు అగ్రాభిసారంగా ఏర్పడతాయి. ఆకులు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. కొన్ని రకాల ఆకుల్ని మనం ఆకు కూరలుగా తింటాము.
పత్రం భాగాలుపత్రంలో నాలుగు భాగాలుంటాయి. 1. పత్రపీఠం (Leaf base): కణుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండే పత్రవృంత పీఠభాగం. 2. పత్రపుచ్ఛం (Stipule): పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు' (Deciduous stipules) అంటారు. ఉ. మైకేలియ. ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను 'దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు' (Persistent stipules) అంటారు. ఉ. రోసా, పైసమ్ 3. పత్రవృంతం (Petiole): పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది. 4. పత్రదళం (Lamina): పత్రవృంతం కొన భాగంలో ఆకుపచ్చగా బల్లపరుపుగా విస్తరించి ఉన్న భాగం. పత్రంలో జరిగే ముఖ్యమైన విధులన్నీ దీనిలోనే జరుగుతాయి. పత్రం నిర్మాణంపత్రం నిర్మాణంలో మూడు భాగాలు ఉంటాయి.
పత్రాలు-ఉపయోగాలు
పత్రాలు రకాలుసరళ పత్రాలుసరళపత్రాలు (Simple leaves)లో పత్రవృంతం చివరలో ఒకే పత్రదళం ఉంటుంది. ఈ పత్రదళం అవిభక్తంగాగాని (ఉదా: అనొనా, సిడియం) లేదా విభక్తంగాగాని ఉంటుంది. పత్రదళం విభక్తమై ఉన్నప్పుడు తమ్మెలు పిచ్ఛాకారంగాగాని (ఉదా: బ్రాసికా), లేదా హస్తాకారంగాగాని (ఉదా: గాసిపియమ్, పాసిఫ్లోరా) ఉండవచ్చును. సంయుక్త పత్రాలుపత్రదళం పూర్తిగా నడిమి ఈనె వరకు, లేదా పత్రవృంతం అగ్రం వరకూ విభక్తమై అనేక పత్రకాలను (Leaflets) ఏర్పరుస్తుంది. సంయుక్తపత్రాలకు గ్రీవపు మొగ్గలుంటాయి. కానీ పత్రకాలకు ఉండవు. సంయుక్త పత్రాల వృంతాన్ని విన్యాసాక్షం (Rachis) అంటారు. సంయుక్తపత్రాలు రెండు రకాలుగా ఉంటాయి.
దీనిలో పత్రకాలు విన్యాసాక్షానికి ఇరువైపులా అమరి ఉంటాయి.
దీనిలో పత్రకాలన్నీ పత్రవృంతం కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి. ఈ పత్రంలో విన్యాసాక్షం ఉండదు. ఇవి పత్రకాల సంఖ్యను బట్టి ఆరు రకాలు.
పత్ర విన్యాసంకాండంపైన, శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని 'పత్రవిన్యాసం' (Phylotaxy) అంటారు. మొక్కలోని పత్రాలన్నీ సూర్యరశ్మిని పొందటానికి అనుగుణంగా కాండంపై ఒక క్రమపద్ధతిలో, గణితబద్ధంగా, జన్యునిర్దేశితమై ఉంటాయి. కణుపులవద్ద ఏర్పడే పత్రాల సంఖ్యను బట్టి పత్రవిన్యాసం మూడు రకాలుగా ఉంటుంది. ఏకాంతర పత్రవిన్యాసంఈ పత్రవిన్యాసంలో ప్రతి కణుపు వద్ద ఒకే పత్రం ఏర్పడుతుంది. పత్రాలన్నీ కాండం చుట్టూ నిర్ధిష్ట దూరంలో నిర్ధిష్టమైన నిలువు వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: మందార. అభిముఖ పత్రవిన్యాసంప్రతీ కణుపు దగ్గర రెండేసి పత్రాలు అభిముఖంగా ఏర్పడతాయి. ఇవి రెండు రకాలు.
వలయ లేదా చక్రీయ పత్రవిన్యాసంప్రతీ కణుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు చక్రీయంగా ఏర్పడతాయి. ఉదా: గన్నేరు. ఈనెల వ్యాపనంపత్ర రూపాంతరాలుపరిసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన విధులను నిర్వహించడానికి పత్రం పూర్తిగాగాని, లేక కొంతభాగంగాని శాశ్వతమైన మార్పుచెందితే దానిని 'పత్రరూపాంతరం' అంటారు. నులితీగలుకొన్ని బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలలో పూర్తి పత్రంగానీ, పత్రభాగాలుగానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడతాయి. ఇవి మొక్కలకు యాంత్రిక ఆధారాన్నిస్తూ, మొక్క ఎగబాకటంలో తోడ్పడతాయి.
కంటకాలుకొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో భాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.
పొలుసాకులుకొన్ని ఎడారి మొక్కలలోను, భూగర్భ కాండాలలోను పత్రాలు క్షీణించి, ఎండిపోయిన పలుచని పొరవంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. వీటిని పొలుసాకులు అంటారు. ఎడారి మొక్కలలో ఇవి భాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. భూగర్భకాండాలలో ఇవి గ్రీవపు మొగ్గలను, కొన మొగ్గలను రక్షిస్తూ ఉంటాయి. ఉల్లిలో పొలుసాకులు ఆహారపదార్ధాలను నిలువచేస్తాయి. ప్రభాసనంపత్రవృంతం గానీ ద్వితీయ విన్యాసాక్షాలు గానీ బల్లపరుపు లేదా రెక్క వంటి ఆకుపచ్చని పత్రం వంటి నిర్మాణంగా మారి కిరణజన్యసంయోగక్రియను జరుపుతాయి. ఉదా: అకేషియా, పార్కిన్ సోనియా ప్రత్యుత్పత్తి పత్రాలుకొన్ని మొక్కలలో పత్రాలు పత్రోపరిస్థిత మొగ్గలను ఉత్పత్తి చేసి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.
బోను పత్రాలునత్రజని సంబంధ పదార్ధాలు లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని సంబంధ పదార్ధాల కోసం కీటకాలు వంటి సూక్ష్మ జంతువుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షించి, భక్షించి, పోషణ జరుపుకోవడానికి వీలుగా వీటిలోని పత్రాలు బోను పత్రాలుగా మార్పుచెందుతాయి. ఇటువంటి మొక్కలను 'కీటకాహార మొక్కలు' అంటారు. బోనులుగా మారిన పత్రాలలో జీర్ణగ్రంధులు ఏర్పడి, జీర్ణరసాలను స్రవిస్తాయి. వీటి సహాయంతో కీటకాలు జీర్ణమై వాటిలోని నత్రజని సమ్మేళనాలు మొక్కచే శోషింపబడతాయి. ఉదా: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా. మూలాలు
ఇవి కూడా చూడండి
|
||||||||||||||||||||||||||||||||
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.